ప్రజా ఆరోగ్యాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది

77చూసినవారు
ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుందని బీఎస్పీ నిర్మల్ జిల్లా ఇన్ఛార్జ్ జగన్మోహన్ సోమవారం అన్నారు. ప్రజా ఆరోగ్య వ్యవస్థను ప్రభుత్వం గాలికి వదిలేయడంతో విష జ్వరాలతో ప్రజలు మంచం పడుతున్నారని, పారిశుద్ధ్య వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో దోమల బెడదతో చికెన్ గున్యా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలుతున్నాయన్నారు. వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్