విపరీతంగా పెరిగిన మాంసాహార వినియోగం వల్ల అనేక మంది గుండె జబ్బులు, క్యాన్సర్, కిడ్నీ, కాలేయ వ్యాధులు, రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. అదే శాకాహారంతో ఈ జబ్బులన్నింటినీ నియంత్రించ వచ్చని నిపుణులు సూచిస్తున్నారు. శాకాహారం మాత్రమే తీసుకోవడం వల్ల క్యాన్సర్ బారిన పడే ముప్పు 40 శాతం తగ్గుతుందని, మాంసాహారం అధికంగా తీసుకునే వారు టైప్-2 మధుమేహం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు చెప్తున్నారు.