కల్తీ మద్యం.. 29కి చేరిన మృతుల సంఖ్య

6449చూసినవారు
కల్తీ మద్యం.. 29కి చేరిన మృతుల సంఖ్య
తమిళనాడులోని కాళ్లకురిచ్చిలో కల్తీ మద్యం తాగిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఆ సంఖ్య 29కి చేరింది. మరో 107 మందికిపైగా బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. మరో వైపు ఈ ఘటనపై సీఎం ఎంకే స్టాలిన్ గురువారం మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. బాధితులకు అత్యవసర సాయం, చికిత్స తదితర అంశాలపై ఆయన చర్చించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్