బంగారం స్మగ్లింగ్ చేస్తూ చిక్కిన అఫ్గాన్ దౌత్యవేత్త

84చూసినవారు
బంగారం స్మగ్లింగ్ చేస్తూ చిక్కిన అఫ్గాన్ దౌత్యవేత్త
భారత్‌లోని అఫ్గానిస్థాన్ కాన్సుల్ జనరల్ జకియా వార్ధక్ స్మగ్లింగ్ కేసులో ఇరుకున్నారు. ఇటీవల దుబాయ్ నుంచి వచ్చిన ఆమె రూ.18..6 కోట్ల విలువైన 25 కిలోల బంగారాన్ని భారత్‌కు అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించారు. నిఘా వర్గాల సమాచారంతో డీఆర్ఐ అధికారులు తనిఖీ చేయగా ఆమె ధరించిన దుస్తువుల్లో బంగారు కడ్డీలు బయటపడ్డాయి. ముంబైలో ఏప్రిల్ 25న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

సంబంధిత పోస్ట్