AP: కళియుగ వైకుంఠం తిరుమలలో భారీ వర్షం కురిసింది. శ్రీవారి ఆలయం, చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల్లో ఈదురుగాలులతో కూడిన వాన పడింది. తీవ్రమైన ఎండలతో అల్లాడిపోతున్న జనాలకు కాస్త ఉపశమనం కలిగింది. అలాగే తిరుపతి, పలమనేరులోనూ మోస్తరు వర్షం కురిసింది. కాగా, ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో మామిడి, వరి పంటలకు నష్టం కలుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.