ప్రస్తుతం చాపకింద నీరులా వేగంగా వ్యాపిస్తున్న ప్రాణాంతక వ్యాధుల్లో ఎయిడ్స్ కూడా ఒకటి. 2023 ముగిసే నాటికి దాదాపు 4 కోట్ల మంది ప్రజలు హెచ్‌ఐవీతో జీవిస్తున్నారని ఐక్యరాజ్యసమితి తాజా నివేదికలో వెల్లడించింది. 90 లక్షల మందికి పైగా చికిత్స తీసుకోవట్లేదని అధ్యయనంలో తేలింది. దీని ఫలితంగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులు ప్రతి నిమిషానికి ఒకరు మరణిస్తున్నట్లు పేర్కొంది. 2004లో 21లక్షల మంది చనిపోగా.. 2023లో 6.3లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.