ఎయిర్‌ ఇండియా కీలక నిర్ణయం.. ఢాకాకు సేవలు నిలిపివేత

63చూసినవారు
ఎయిర్‌ ఇండియా కీలక నిర్ణయం.. ఢాకాకు సేవలు నిలిపివేత
బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో ఎయిర్‌ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాకు తన విమానాల రాకపోకలను రద్దు చేస్తూ ఎయిర్‌ ఇండియా అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఢాకాకు విమానాల రాకపోకల రద్దు తక్షణమే అమల్లోకి వస్తుందని ఆ ప్రకటనలో పేర్కొంది. షెడ్యూల్‌ ప్రకారం భారత్‌ నుంచి ఢాకాకు వెళ్లాల్సిన, ఢాకా నుంచి భారత్‌కు రావాల్సిన విమాన సేవలను రద్దు చేసినట్లు తెలిపింది.

సంబంధిత పోస్ట్