హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అధికారులు తమ కస్టమర్లకు కీలక అలర్ట్‌ను జారీ చేశారు. అత్యవసర సర్వీస్ మెయింటెనెన్స్ నిమిత్తం తన వినియోగదారులకు ఆగస్టు 10న తెల్లవారుజామున 2.30 గంటల నుంచి 5.30 వరకు యూపీఐ సేవలు నిలిచిపోతాయని ప్రకటించింది. ఆ సమయంలో గూగుల్ పే, వాట్సాప్ పే, పేటీఎం, హెచ్‌డీఎఫ్‌సీ యాప్, మోబీక్విక్, శ్రీరామ్ ఫైనాన్స్ వంటి సర్వీసులు పని చేయవని తెలిపింది. ఈ మేరకు యూజర్లకు ఈమెయిల్స్ పంపించింది.