రైలు ప్రయాణికులకు అలర్ట్

57చూసినవారు
రైలు ప్రయాణికులకు అలర్ట్
రైలు ప్రయాణాల్లో రిజర్వేషన్ చేయించుకున్నవారు టికెట్ తో పాటు ఏదైనా ఐడీ కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలని రైల్వే అధికారులు సూచించారు. టీటీఈ అడిగినప్పుడు గుర్తింపు కార్డును చూపించకపోతే టికెట్ లేనట్లు పరిగణించి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఒకరి టికెట్ తో మరొకరు ప్రయాణించడాన్ని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆధార్, ఓటర్, పాన్, లైసెన్స్ తదితరాల్లో ఏ ఐడీ కార్డునైనా చూపించవచ్చని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్