TG: అల్లు అర్జున్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మండిపడ్డారు. సంగారెడ్డిలో ఆయన మాట్లాడుతూ.. పుష్ప 2 సినిమా దేశ వ్యాప్తంగా అత్యధిక డబ్బులు వసూళ్లు చేసిందని అన్నారు. "ఆయన సినిమా వల్ల ఓ మహిళ చనిపోతే 25 లక్షల రూపాయలు బిక్షం వేస్తున్నారా?.. ఒక జీవితం ఖరీదు 25 లక్షలా..? ప్రశ్నించారు. పుష్ప 2 సినిమాతో వచ్చిన లాభం మొత్తం రేవతి కుటుంబానికి ఇవ్వాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు.