ఏపీలో మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రంలోని మొత్తం 3,396 దుకాణాల్లో ఇప్పటివరకు 2,917 షాపుల కేటాయింపులు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 85.90 శాతం దుకాణాల లాటరీ పూర్తైంది. మొత్తం 12 జిల్లాల్లో మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ అధికారులు పూర్తి చేశారు. ఇంకా 479 దుకాణాల కోసం 14 జిల్లాల్లో లాటరీ ప్రక్రియ కొనసాగుతోంది.