అల్లు అర్జున్ బెయిల్‌ పిటిషన్ విచారణ వాయిదా

58చూసినవారు
అల్లు అర్జున్ బెయిల్‌ పిటిషన్ విచారణ వాయిదా
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌ బెయిల్‌ పిటిషన్‌పై సోమవారం నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఇరువురి వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను జనవరి 3కు వాయిదా వేసింది. కాగా ఈరోజు అల్లు అర్జున్‌ రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌పై పోలీసులు కౌంటర్‌ దాఖలు చేశారు. కాగా ప్రస్తుతం అల్లు అర్జున మధ్యంతర బెయిల్‌పై బయట ఉన్నారు.  జనవరి పదో తేదీతో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ పర్మిషన్‌ ముగియనుంది.

సంబంధిత పోస్ట్