సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను ఉద్దేశించి టీజీఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ''కాసులకి కక్కుర్తి పడి ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంటున్న బెట్టింగ్ యాప్లను ప్రచారం చేయకండి. వాటి వల్ల అమాయకులు ఆన్లైన్ బెట్టింగ్ లకు వ్యసనపరులుగా మారుతున్నారు. మీ స్వలాభంకోసం ప్రజాశ్రేయస్సును విస్మరించడం ఎంతవరకు సమంజసం?. కష్టపడకుండానే కాసులు పోగేసుకోవాలన్న ఆలోచన అనర్థదాయకమైందని యువత గుర్తించాలి'' అని పేర్కొన్నారు.