అమెజాన్ ఇండియా అధిపతి మనీశ్ తివారీ తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఇ- కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ మంగళవారం వెల్లడించింది. కంపెనీకి వెలుపల ఇతరత్రా వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి తివారీ రాజీనామా చేశారని.. అక్టోబర్‌లో ఆయన కంపెనీ వీడుతారని అమెజాన్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. గత 8 ఏళ్లుగా కంపెనీని వృద్ధి బాటలో నడిపేందుకు ఆయన కీలకపాత్ర పోషించారని పేర్కొంది.