పేపర్ బాయ్‌లు ఉదయం మూడున్నరకే నిద్రలేచి పరుగుపరుగున రోడ్డెక్కి అడ్డా మీదికి చేరుకుంటారు. వాహనాల్లో వచ్చిన పేపర్ బండిళ్లను సర్దుకుని, బాక్సుల్లో అమర్చి రూట్‌మ్యాప్ ప్రకారం ఇంటింటికి సమాచార సంచికను అందజేస్తుంటారు. విలేకరులు పొద్దంతా కష్టపడి సేకరించిన వార్తలు ముద్రణ ప్రక్రియ తర్వాత సకాలంలో పాఠకులకు చేరితేనే పత్రికకు, దాని వెనుక దాగి ఉన్న శ్రమకు విలువ ఉంటుంది. ఏమాత్రం ఆలస్యమైనా ఆ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరే.