తెలుగు రాష్ట్రాలకు జస్టిస్‌ ఎన్వీ రమణ విరాళం

67చూసినవారు
తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ విరాళం అందజేశారు. తెలుగు రాష్ట్రాలకు చెరో రూ.10లక్షల విరాళం ప్రకటించారు. ఢిల్లీలో ఏపీ, తెలంగాణ భవన్‌ల రెసిడెంట్‌ కమిషనర్లకు చెక్కులను అందజేశారు. ఎన్వీ రమణ మాట్లాడుతూ ఈ కష్ట సమయంలో ప్రతి ఒక్కరూ తమకు చేతనైనంత సాయం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తెలుగు ప్రజలను ఉదారంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్