ఈనెల 20, 21 తేదీల్లో అమెజాన్ ప్రైమ్ డే సేల్ ప్రారంభంకానుంది. ఈక్రమంలో కస్టమర్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెజాన్ రిటైలర్లమంటూ మోసపూరిత సైబర్ నేరగాళ్లు ఈ-మెయిళ్లు పంపించే అవకాశముందని, గుడ్డిగా క్లిక్ చేయొద్దని సూచిస్తున్నారు. అమెజాన్‌తో అనుబంధం ఉన్న దాదాపు 1,230 కొత్త వెబ్‌సైట్లు ఇటీవలే పుట్టుకొచ్చాయని, వీటిలో చాలావరకు మోసపూరిత ఉద్దేశంతోనే సృష్టించినవిగా గుర్తించినట్లు తెలిపారు.