8 ఏళ్లకే బ్యాట్ పట్టిన అంబటి రాయుడు 16 ఏళ్ల వయసులో HCA తరపున ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు. అంతకుముందు ఏసీసీ అండర్ -15 ట్రోఫీ (2000లో) విజేత జట్టులో సభ్యుడు. పాక్‌పై ఫైనల్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు. కేవలం మూడో రంజీ మ్యాచ్‌లోనే 159, 210 పరుగులు సాధించాడు. అదీనూ ఆంధ్రా జట్టుపై కావడం గమనార్హం. ఒకే మ్యాచ్‌లో డబుల్ సెంచరీ, శతకం బాదిన అతిపిన్నవయస్కుడిగా రికార్డు సృష్టించాడు. ధావన్, రైనా, దినేశ్ కార్తీక్, ఊతప్పలతో కలిసి అండర్-19 ప్రపంచకప్‌లో ఆడాడు.