AP: దీపావళికి 3 ఉచిత సిలిండర్ల పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. సీఎం చంద్రబాబు 100 రోజుల పాలన చూసి పలువురు టీడీపీలో చేరుతున్నారని ఆయన తెలిపారు. అయితే దీపావళి నుండి ఫ్రీ గ్యాస్ సిలిండర్ స్కీమ్‌ను అమలు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దీపావళి పండుగ రోజున అర్హులకు తొలి ఉచిత సిలిండర్ అందించనున్నారు.