మైక్రోసాఫ్ట్ విండోస్‌లో సాంకేతిక సమస్య తలెత్తిన వేళ స్టీవ్ జాబ్స్ దాదాపు 30 ఏళ్ల క్రితం మాట్లాడిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియోలో 'మైక్రోసాఫ్ట్‌తో ఉన్న ఏకైక సమస్య అదే. వాళ్లకు ఎలాంటి అభిరుచి ఉండదు. వాస్తవిక ఆలోచనలపై వారు దృష్టిపెట్టరు. నా సమస్యల్లా.. వారు థర్డ్ రేట్ (నాసిరకం) ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావడమే' అని స్టీవ్ జాబ్స్ అన్నారు.