స్పృహ తప్పి పడిపోయిన యాంకర్ (వీడియో)

5634చూసినవారు
ప్రముఖ నటి, న్యూస్ యాంకర్ లోపాముద్ర సిన్హా టీవీ లైవ్‌లో వార్తలు చదువుతూ స్పృహతప్పి పడిపోయారు. ఈ ఘటన కోల్‌కతా దూరదర్శన్‌ కార్యాలయంలో గురువారం జరిగింది. లోపాముద్ర అస్వస్థతకు గురైన వెంటనే ప్రసారాన్ని నిలిపివేశారు. తన అస్వస్థతకు కారణాన్ని ఫేస్‌బుక్‌లో లైవ్‌ ద్వారా ఆమె తాజాగా తెలియజేసింది. ఎండ వేడిమికి తన బీపీ డౌన్ అయిందని, దీంతో స్పృహ కోల్పోయానని పేర్కొంది. ప్రేక్షకులు క్షమించాలని కోరింది.

సంబంధిత పోస్ట్