ఇక నుంచి క్యూఆర్ కోడ్‌తో కొత్త పాన్ కార్డులు రానున్నాయి. PANను ప్రభుత్వ ఏజెన్సీలకు చెందిన అన్ని డిజిటల్ వ్యవస్థల్లో ‘సామాన్య వ్యాపార గుర్తింపు’గా చేయడం కోసం రూ.1435 కోట్లతో పాన్ 2.0 ప్రాజెక్ట్‌ను కేంద్రం ప్రకటించింది. మంత్రివర్గ సంఘం ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపినట్లు మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. దీంతో పన్ను చెల్లింపుదార్ల రిజిస్ట్రేషన్ సేవలు సులువుగా, వేగంగా చేసేందుకు వీలవుతుందని తెలిపారు.