పేదలకు ఉచిత కరెంట్ ఇచ్చినందుకా నా మీద కోపం: సీఎం (వీడియో)

63చూసినవారు
తనపై వ్యతిరేకత, కోపం ఉందని చాలా మంది అంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో కొలువుల పండుగ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 10 నెలల్లో రైతులకు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు, 1000 మెగావాట్ల సోలార్ కాంట్రాక్ట్‌తో ఆడబిడ్డల సాధికారత, పేదలకు ఉచిత కరెంట్ ఇచ్చినందుకా? అని ప్రశ్నించారు. తన పాలనలో ప్రజల బాగోగులే లక్ష్యమని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్