ఖాళీ కడుపుతో కలబంద జ్యూస్ తాగడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కలబంద జ్యూస్‌లో విటమిన్లు A, C, E, B1, B2, B3, B6, B12 పుష్కలంగా ఉంటాయి. కలబంద జ్యూస్ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇంకా గ్యాస్, మలబద్ధకం తగ్గుతుంది. ఇందులోని యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు రోగ నిరోధక శక్తిని పెంచి, వ్యాధుల నుండి కాపాడతాయి. ముఖ్యంగా రక్తంలో చక్కెరను తగ్గించి, మధుమేహాన్ని నియంత్రిస్తుంది.