టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడితో ప్రాణహాని: జనసేన నేత

72చూసినవారు
టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడితో ప్రాణహాని: జనసేన నేత
AP: తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై జనసేన నేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన అవినీతిపై తన వద్ద ఆధారాలు ఉన్నాయని జనసేన సమన్వయకర్త మునుబోలు శ్రీనివాసరావు చెప్పారు. విద్యుత్ శాఖలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల కోసం రూ.6లక్షలు, ఫీల్డ్ అసిస్టెంట్ల నుంచి రూ.2లక్షలు వసూలు చేశారని  విమర్శించారు. మట్టి, మద్యంలో అవినీతి వాటా ఎంతో కొలికపూడి చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయనతో ప్రాణహాని ఉందని, కాపాడాలని వాపోయారు.

సంబంధిత పోస్ట్