భారతదేశంలోని విద్యాసంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే అంతర్జాతీయ విద్యార్థుల కోసం ప్రభుత్వం రెండు ప్రత్యేక కేటగిరీ వీసాలను అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు ‘ఇ-స్టూడెంట్ వీసా’, ‘ఇ-స్టూడెంట్స్-ఎక్స్’ వీసాలను కేంద్ర హోం మంత్రిత్వశాఖ ప్రవేశపెట్టింది. వీటి దరఖాస్తు కోసం ప్రభుత్వం ప్రారంభించిన స్టడీ ఇన్ ఇండియా (ఎస్ఐఐ) పోర్టల్‌ను సందర్శించాలని అధికారులు తెలిపారు.