‘చిన్నారులంతా ఫోన్లు, టాబ్‌లకు, టీవీలకు అతుక్కుపోతున్నారని, అన్నం తినాలన్నా ఫోన్ ఉంటేనే తింటున్నారని, తల్లిగా నాకు ఆ సమస్య తెలుసు’ అని టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అన్నారు. ‘సీసా స్పేసెస్’తో కలిసి సానియా ఈ ఏడాది కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. చిన్నారులకు చదువు ఒక్కటే కాదని, మంచి వాతావరణం, ఫిట్‌నెస్, మంచి ఆహారం ఎంతో అవసరమన్నారు. ఈ అంశాల్లో సీసాతో కలిసి పనిచేయనున్నట్లు తెలిపారు.