అక్టోబరు 4 నుంచి తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని తితిదే అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. అక్టోబరు 4న ధ్వజారోహణం, 8న గరుడ సేవ, 9న స్వర్ణరథం, 11న రథోత్సవం, 12న చక్రస్నానం నిర్వహిస్తారు. వాహన సేవలు ప్రతిరోజూ ఉదయం 8గంటలకు, సాయంత్రం 7గంటలకు ప్రారంభమవుతాయి. సాధారణంగా గరుడ సేవ రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.