కాంగ్రెస్‌లోకి మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే..?

77చూసినవారు
కాంగ్రెస్‌లోకి మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే..?
బీఆర్ఎస్ లో ఉన్న కొద్దీ మంది ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్ ఉంచే పరిస్థితి కనిపించడం లేదు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ జోరు పెంచింది. పోచారం వంటి సీనియర్ నేత కాంగ్రెస్ లో చేరడం బిఆర్ఎస్ శ్రేణులు తట్టుకోలేకపోతున్నారు. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని కలవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆయన కూడా కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని వార్తలొస్తున్నాయి.

సంబంధిత పోస్ట్