172 మంది ఎమ్మెల్యేల ప్రమాణం.. ముగ్గురు గైర్హాజరు

80చూసినవారు
172 మంది ఎమ్మెల్యేల ప్రమాణం.. ముగ్గురు గైర్హాజరు
172 మంది ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు. అందుబాటులో లేకపోవడం, ఇతర కారణాలతో ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారానికి గైర్హాజరయ్యారు. శనివారం ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, పితాని, వనమాడి వెంకటేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు ఉదయం 10.30 గంటలకు శాసనసభ ప్రారంభం కానుంది. 11 గంటలకు స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడిని ఎన్నుకోనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్