TG: హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 9న హుజురాబాద్ లో కల్యాణ లక్మీ, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేయాలని ధర్నా చేపట్టారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసందే. అయితే ఈ ధర్నాకు ఎలాంటి అనుమతులు తీసుకోలేదని పోలీసులు కేసు నమోదు చేశారు. కౌశిక్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలపై కూడా కేసులు నమోదు చేశారు.