పెర్త్ వేదికగా ప్రస్తుతం భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఎంతో రసవత్తరంగా సాగుతోంది. ఈ మేరకు భారత బ్యాటర్లు మంచి జోష్ లో ఆడుతున్నారు. అయితే భారత జట్టుకు మరింత బలం చేకూరనుంది. తొలి టెస్టుకు దూరమైన స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాకు పయనమయ్యాడు. శనివారం (నవంబర్ 23) ముంబయి విమానాశ్రయంలో కనిపించాడు. తన సతీమణి రితికా అతడికి హగ్ ఇచ్చి సెండాఫ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.