పంజాబ్ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు ముగియగానే.. మరోసారి ఎన్నికల సమరం వచ్చే అవకాశముంది. ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలు లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగడమే ఇందుకు కారణం. ఆ రాష్ట్రంలో 12 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వీరు విజయం సాధిస్తే.. ఆయా అసెంబ్లీ స్థానాల్లో ఆరు నెలల్లో ఉప ఎన్నికలు వస్తాయి.