మంత్రి హరీశ్‌రావు స్థానిక సంస్థలకు శుభవార్త చెప్పారు. ఈ ఏడాది నుంచి ప్రభుత్వం విడుదల చేసే పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి నిధులతో పాటు ఫైనాన్స్ కమిషన్ నిధులను స్థానిక సంస్థల ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేస్తామని తెలిపారు. దీంతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఫైనాన్స్, ట్రెజరీల ఆమోదం కోసం వేచి చూడకుండా, స్వతంత్రంగా నిధులు వినియోగించుకునే అవకాశం కలుగుతుందని అన్నారు.