జమిలి ఎన్నికల బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడాన్ని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. బీజేపీ భారత రాజ్యాంగాన్ని బలహీనపరుస్తోందని ఆరోపించారు. బీఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని తన సొంత వెర్షన్‌తో భర్తీ చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. జమిలి బిల్లు ద్వారా రాజ్యాంగాన్ని ఉల్లంఘించే ఏ ప్రయత్నానికీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వదని షర్మిల తెలిపారు.