నేటి నుంచి దరఖాస్తులకు మరో అవకాశం

77చూసినవారు
నేటి నుంచి దరఖాస్తులకు మరో అవకాశం
TG: రైతుభరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు సంబంధించి నేటి నుంచి ప్రభుత్వం మరోసారి దరఖాస్తులను స్వీకరిస్తోంది. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇప్పటికే అర్హుల జాబితా ఆయా గ్రామాలకు చేరింది. తమ పేర్లు రాలేదని కొందరు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో వారికి అవకాశమివ్వాలని సర్కారు నిర్ణయించింది. అలాంటివారి నుంచి గ్రామసభల్లో దరఖాస్తులు స్వీకరించాలని అధికారులను ఆదేశించింది.

సంబంధిత పోస్ట్