తిరుమల లడ్డూ వివాదంపై హీరో కార్తీ స్పందించిన తీరుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా కార్తీని ఉద్దేశిస్తూ పవన్ ట్విట్టర్‌లో మరో పోస్టు పెట్టారు. మన సంప్రదాయాలను గౌరవిస్తూ కార్తీ స్పందించిన తీరు సంతోషమని అన్నారు. కావాలని కార్తీ అలా అనలేదని తాను అర్థం చేసుకున్నట్లు పవన్ తెలిపారు.