ఉన్నతాధికారి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ వాయుసేన అధికారిణి చేసిన ఫిర్యాదు తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వింగ్ కమాండర్‌కు ముందస్తు బెయిల్ లభించింది. శ్రీనగర్ బేస్‌లో వింగ్ కమాండర్ స్థాయి అధికారి తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అదే కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న మహిళా అధికారిణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.