ఇటీవల ఇంట్లో కుక్కలు, పిల్లులను పెంచుకోవడం సర్వసాధారణమైపోయింది. అయితే, పిల్లలకు పాలిచ్చి పెంచే కుక్కలు, పిల్లులు, తదితరాల నుంచి ర్యాబిస్ వ్యాధి వ్యాప్తి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధి సోకిన జంతువుల లాలాజలంలో వ్యాధికారక క్రిములు ఉంటాయి. పెంపుడు జంతువులతో దగ్గరగా ఉన్నప్పుడు అవి కరిచినా, తుమ్మినా వ్యాధి క్రిములు మన శరీరంలోకి చేరతాయి. తీవ్రమైన తలనొప్పి, గొంతునొప్పి, జ్వరం వంటివి ర్యాబిస్ లక్షణాలు.