హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ అటవీ ప్రాంతంలో మంటలు కొనసాగుతూనే ఉన్నాయి. 10 గంటల క్రితం అంటుకున్న కార్చిచ్చు ఇప్పటివరకు చల్లారలేదు. దట్టమైన అడవి కావడంతో మంటలను అదుపు చేయడం కష్టమవుతోందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. మంటలను అదుపు చేయడానికి పయత్నిస్తున్నామని తెలిపారు.