రోజూ 10 నిమిషాలు నవ్వడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. నవ్వినప్పుడు మన శరీరం ఎండార్ఫిన్లను విడుదల చేస్తుంది. ఫలితంగా మైండ్ రిలాక్స్ అవుతుంది. టెన్షన్ పోతుంది. హార్ట్ ఎటాక్, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. ఎల్లప్పుడూ విచారంగా ఉండే వారు లాఫ్టర్ థెరపీని పాటిస్తే ఉత్సాహంగా మారుతారు. నవ్వడం వల్ల శ్వాసకోశ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. దీంతో ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది.