కల్తీ మద్యం తాగి ఏడుగురు మృతి చెందారు. ఈ ఘటన బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో చోటు చేసుకుంది. అన్ని మరణాలు లౌరియా పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదయ్యాయని పోలీసు సూపరింటెండెంట్ శౌర్య సుమన్ తెలిపారు. దీనిపై విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు. అయితే మృతదేహాలను ఇప్పటికే వారి కుటుంబ సభ్యులు దహనం చేసినట్లు చెప్పారు. దీంతో పోస్ట్‌మార్టం నిర్వహణకు అవకాశం లేకుండా పోయిందన్నారు.