నందమూరి తారక రామారావు కుమారుడిగా ఆయన సినీ వారసుడిగా రుజువు చేసుకున్న బాలకృష్ణ గత యాభై ఏళ్ళుగా వెండితెరను ఏలుతున్నారు. గత నాలుగేళ్లుగా చూస్తే బాలయ్య జాతకం మామూలుగా లేదు. ఇక ఆయన ప్రజా జీవితం గురించి చర్చించుకుంటే వరసగా మూడు సార్లు హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే బాలయ్యకు పార్టీ పరంగా ప్రమోషన్ దక్కే చాన్స్ ఉందని అంటున్నారు. టీడీపీకి సంబంధించి కీలకమైన పదవిని ఇస్తారని అంటున్నారు.