AAP కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌కు లేఖ రాశారు. లేఖలో బీజేపీపై భగవత్‌కు పలు ప్రశ్నలు సంధించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆప్ నుంచి కాంగ్రెస్, బీజేపీ వరకు అన్ని పార్టీలు ఎన్నికల సన్నాహాల్లో బిజీగా ఉన్నాయి. ఈ క్రమంలో ఎన్నికలకు సంబంధించి ప్రశ్నలు అడుగుతూ కేజ్రీవాల్ ఇప్పుడు మోహన్ భగవత్‌కు లేఖ రాశారు.