పంజాబ్‌లో 14 వరకు స్కూళ్లు మూసివేత

56చూసినవారు
పంజాబ్‌లో 14 వరకు స్కూళ్లు మూసివేత
రాష్ట్రంలో తీవ్రమైన చలి ఉన్న నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 14 వరకు పాఠశాలలు మూసివేయాలని ఆదేశాలు ఇచ్చింది. పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం భగవంత్ మాన్ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఈ ఆదేశాలు విధిగా పాటించాలన్నారు. ప్రస్తుతం పంజాబ్‌లో చలి తీవ్రత అధికంగా ఉంది. ఉదయం 9 గంటల వరకు దట్టమైన పొగమంచు ఉంటోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్