గతంలోనూ వాయుసేన స్థావరంపై దాడి

84చూసినవారు
గతంలోనూ వాయుసేన స్థావరంపై దాడి
పంజాబ్‌లోని పఠాన్‌ కోట్‌‌లో ఉన్న భారత వాయుసేన కీలక స్థావరంపై 2016 జనవరిలో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. అప్పట్లో కూడా వారు తొలుత వీధుల్లో తిరుగుతూ వాహనాలను హైజాక్‌ చేసి ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌లోకి ప్రవేశించారు. ఆ తర్వాత అక్కడే భారీగా పెరిగిన గడ్డిలో దాగారు. తెల్లవారుజామున సిబ్బంది క్వార్టర్స్‌లోకి ప్రవేశించి దాడి చేసి పలువురి ప్రాణాలను బలిగొన్నారు. నేడు ఇవే పరిస్థితులు తలెత్తడంతో హైఅలర్ట్ ప్రకటించారు.

సంబంధిత పోస్ట్