ఆఫ్రికా దేశమైన చాద్ అధ్యక్ష భవనంపై గురువారం దుండగుల దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 18 దుండగులు, ఓ సైనికుడు మృతి చెందారు. పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. ఘటనా సమయంలో భవనంలోనే ఉన్న అధ్యక్షుడు మహమత్ దెబీ ఇత్నో ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది గాయపడినవారిని ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. అధ్యక్షుడు మహమత్ దెబీ ప్రాణాపాయంతో బయటపడడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.