నల్గొండ మాజీ ఎమ్మెల్యేపై దాడి (వీడియో)

79చూసినవారు
TG: నల్గొండ పట్టణంలో రైతు మహా ధర్నా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో నల్గొండ బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిపై కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారు. అయితే క్రమంలో భూపాల్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్