ఏపీ గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా మారబోతోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మంగళవారం దావోస్‌లో గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్ సదస్సులో సీఎం మాట్లాడుతూ " ఏపీలో విద్యుత్ ఉత్పాదనకు మంచి అవకాశాలున్నాయి.115 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు ఇంధన వనరుల్లో వస్తున్నాయి. 500 మెగావాట్ల , 5 ఎంపీటీఏ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయబోతున్నాం. 21 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఎన్టీపీసీ-ఏపీ జెన్‌కో సంయుక్తంగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయబోతున్నాయి." అని అన్నారు.