బీజేపీ తాజాగా విడుదల చేసిన మ్యానిఫెస్టోపై ఆప్ అధినేత కేజ్రీవాల్ స్పందించారు. బీజేపీ మ్యానిఫెస్టో ప్రకారం.. ఢిల్లీ ప్రభుత్వంలో అర్హులైన విద్యార్థులకు మాత్రమే ఉచిత విద్య లభిస్తుందా? అని ప్రశ్నించారు. ‘ఆప్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికీ ఉచిత విద్య లభిస్తోంది. తమ పిల్లలను విద్యాసంస్థల్లో చేర్చేందుకు తల్లిదండ్రులు బీజేపీ కార్యాలయాల చుట్టూ తిరగాలని వారు కోరుకుంటున్నారు. డిల్లీ ప్రజలారా జాగ్రత్తగా ఉండండి’ అని విమర్శలు చేశారు.